జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. సదన్హాసన్, విక్రమ్‌జిత్, నరేష్‌రాజు, వినయ్‌బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర పురాణాల తాలూకు పాత్రలను, వ్యక్తిత్వాలను గుర్తుకు తెస్తుందని, చక్కటి సామాజిక సందేశంతో ఈ సినిమా తీశామని తెలిపారు.
రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా మిగిలిపోతుందని నిర్మాతలు దైవ నరేష్‌గౌడ్, పరిగి స్రవంతి మల్లిక్ అన్నారు. ఈ సినిమా ద్వారా స్త్రీశక్తి గొప్పదనాన్ని తెలుసుకోవచ్చని నాయకానాయికలు పేర్కొన్నారు. శ్రీలు, అదితి మైకేల్, మోహనసిద్ధి, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, దర్శకుడు: నరసింహ నంది.