Prabhas | వృద్ధుడి పాత్రలో ప్రభాస్.. మారుతి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్!
Prabhas | దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ కథాంశమిది.
Prabhas | దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ కథాంశమిది. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ కూడా మారుతి గత చిత్రాల తరహలోనే వినోదప్రధానంగా సాగుతుందని తెలిసింది. ప్రభాస్ ఇమేజ్‌కు తగిన పోరాట ఘట్టాలతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తూ మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని అంటున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆయన వృద్ధుడి పాత్రలో కనిపిస్తారని, ఆ సీక్వెన్స్ ఆసాంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ ‘రాయల్’ ‘అంబాసిడర్’ అనే పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటివరకు టైటిల్ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నదని తెలిసింది. ఇదిలావుండగా ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ దీపావళికి ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

