ఆజాద్ హింద్ ‘ఫౌజీ’?
పాత్ర చిత్రణ, కథ, కథనం.. ఈ మూడూ సినిమా విజయంలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. వీటి విషయంలో దర్శకుడు అప్రమత్తంగా ఉంటే చాలు.. విజయం తథ్యం. దర్శకుడు హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రం విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.
పాత్ర చిత్రణ, కథ, కథనం.. ఈ మూడూ సినిమా విజయంలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. వీటి విషయంలో దర్శకుడు అప్రమత్తంగా ఉంటే చాలు.. విజయం తథ్యం. దర్శకుడు హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రం విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన గత విజయం ‘సీతారామం’ విషయంలోనూ ఇదే రీతిని అనుసరించారాయన. ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర తీరుతెన్నుల గురించి ఆసక్తికరమైన వివరాలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని ముందునుంచీ చెబుతూనే ఉన్నారు.
అయితే.. కథ రీత్యా ముందు ఆయన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ సైనికుడిగా కనిపిస్తారట. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘అజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించడంతో నేతాజీ నేతృత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగించేందుకు తాను కూడా అజాద్ హింద్ ఫౌజ్లో చేరతాడట. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ఓ సైనికుని కథగా ఈ సినిమా సాగుతుందని టాక్. ఇందులో ప్రభాస్ పాత్ర.. ధైర్య సాహసాలతో, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని వినికిడి. ఇమాన్వి కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుందట. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

