గ్రీస్‌లో రాజాసాబ్ సందడి
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్'. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం యూరప్ పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రీస్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌పై తెరకెక్కిస్తున్న సోలో గీతమిది.
ఇది పూర్తయిన తర్వాత ప్రభాస్-నిధిఅగర్వాల్పై ఓ రొమాంటిక్ పాటను తీయబోతున్నారు. ఈ రెండు పాటలతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో హరర్ అంశాలతో పాటు ప్రభాస్ పండించిన కామెడీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్‌దత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

