Prabhas | ఇప్పటికిప్పుడు ఇండియా స్టార్ హీరో(India Star Hero) ఎవరా అంటే గూగుల్ సైతం ప్రభాస్ పేరే చూపెడుతుంది. అంతలా ప్రభాస్ తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్లు సైతం కొందరి స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమా కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఆ రేంజ్ క్రేజ్ ఉంది గనుకు కోట్ల రూపాయిలు ఆయనపై పెట్టుబడి పెట్టాడానికి నిర్మాతలు కదిలి వస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తీరిక లేకుండా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ నెల చివరాఖరున రిలీజ్ కాబోయే సలార్ పోస్ట్ పోన్ అవడంతో లిటరల్‌గా ప్రభాస్ అభిమనుల గుండెలు బద్దలైపోయాయి. ఆదిపురుష్ కొట్టిన దెబ్బకు సరైన మందు సలారే అంటూ వేల కోట్ల ఆశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు తేరుకోలేని షాక్ తగిలింది.
సీజీ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్న కారణంగా నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనితో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. అది కూడా సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడట. భక్త కన్నప్ప శివుడికి పరమ భక్తుడు. కాగా ఈ సినిమాలో భక్త కన్నప్ప పాత్రలో విష్ణు నటించనుండగా.. ఆయన కొలిచే శివుడుగా ప్రభాస్ కొన్ని క్షణాల పాటు కనిపించనున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇదే గనుక నిజమైతే సినిమా స్థాయి ఏంటా అని ఊహించడం కూడా కష్టమే.
సాక్షాత్తు శివుడు సన్నిదైన శ్రీకాళహస్తిలో ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించారు. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా గ్రాండియర్ స్కేల్లో దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సమాచారం. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో భక్త కన్నప్ప గొప్పతాన్ని ఈ తరానికి చూపించబోతున్నారట. శ్రీవిష్ణుకు జోడీగా టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తుంది.