పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు సలార్ (Salaar). బ్లాక్ బాస్టర్ కేజీఎఫ్ ప్రాంఛైజీని ప్రేక్షకులకు అందించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ఇవాళ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. దీంతోపాటు 2023 సెప్టెంబర్ 28న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుందని ప్రకటించారు.
డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్ లొకేషన్లో కౌబాయ్ లుక్ గుర్తుకు తెచ్చేలా ఓ వైపు పిస్తోల్స్, మరోవైపు పదునైన కత్తులు పట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ విజువల్ ట్రీట్ అందిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్. కేజీఎఫ్ ప్రాంచైజీకి సంగీతం అందించిన రవిబస్రూర్ మరోసారి ఈ క్రేజీ కాంబో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్‌లో థ్రిల్ కలిగించే యాక్షన్ సన్నివేశాలు రెడీ చేస్తున్నాడని తాజా లుక్‌తో చెప్పేశాడు డైరెక్టర్ ప్రశాంత్‌నీల్. సలార్‌లో లోయ ప్రాంతంలో వచ్చే భారీ ఛేజింగ్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉండనుందట.
'𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/8vriMflG84
— Salaar (@SalaarTheSaga) August 15, 2022