Kalki 2 | ప్రభాస్ అభిమానులతో, సైన్స్ ఫిక్షన్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘కల్కి 2898 AD’ ప్రాంచైజీ. ఇప్పటికే ఫస్ట్ పార్ట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్-నాగ్ అశ్విన్ టీం ఇక సీక్వెల్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. అయితే సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఇప్పటికే అమితాబ్ బచ్చన్ షూట్లో పాల్గొన్నట్టు ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. హీరో ప్రభాస్ నేడు కల్కి సీక్వెల్ షూట్లో జాయిన్ అయ్యాడట. ఎక్కువగా నైట్ షూట్స్ ఉండనుండగా.. కొన్ని రోజులపాటు ఈ షెడ్యూల్లో పాల్గొనున్నట్టు ఇన్సైడ్ టాక్. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ షూట్‌కు సంబంధించి మేకర్స్ ఏమైనా అప్డేట్స్ అందిస్తారేమో చూడాలి. కాగా ఫస్ట్ పార్ట్‌లో దీపికా పదుకొనే పోషించిన సుమతి పాత్ర కోసం సీక్వెల్లో ఇంకా ఏ నటిని ఫైనల్ చేయలేదు మేకర్స్. కమల్ హాసన్‌తోపాటు పలువురు కీలక నటీనటులు సీక్వెల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది.
భారీ విజువల్ వండర్‌గా మారిన ‘కల్కి 2898 AD’లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లీడ్యాక్టర్లు నటించడంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ విఎఫ్ఎక్స్, యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫస్ట్ పార్ట్‌ను తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ ఈ చిత్రాన్నినిర్మించనున్నారు.