Prabhas | ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌తో పాత జ్ఞాపకాల పండుగ!
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘డార్లింగ్’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఆయనకు “డార్లింగ్” అనే ట్యాగ్ తెచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఇప్పుడు రీ-రిలీజ్ రూపంలో తిరిగి థియేటర్లలో సందడి చేయబోతోంది.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘డార్లింగ్’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఆయనకు “డార్లింగ్” అనే ట్యాగ్ తెచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఇప్పుడు రీ-రిలీజ్ రూపంలో తిరిగి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 23న గ్రాండ్‌గా మళ్లీ విడుదల కానుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ప్రభాస్ నటన, స్టైలిష్ లుక్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాతే ఆయనకు “డార్లింగ్” అనే పేరుతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
ఈ సినిమా ఒక హృద్యమైన ప్రేమకథ. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన హీరో, తన చిన్ననాటి స్నేహితురాలు నందిని (కాజల్ అగర్వాల్)ను మళ్లీ కలుసుకుంటాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే కథలో ట్విస్ట్‌గా గ్యాంగ్‌స్టర్ కుమార్తె నిషా కూడా హీరోను ప్రేమించడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ లవ్ ట్రైయాంగిల్‌లో వచ్చే ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రాన్ని ఏ. కరుణాకరన్ తెరకెక్కించారు. ఆయన ప్రత్యేకమైన కథనం, ఫీల్-గుడ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రభాస్–కాజల్ కెమిస్ట్రీ కూడా ఈ చిత్ర విజయానికి కీలకంగా మారింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ది రాజాసాబ్’తో తన క్రేజ్‌ను మరోసారి చూపించిన ఆయన, ప్రస్తుతం ‘ఫౌజీ’ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. అదేవిధంగా ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’, ‘స్పిరిట్’ వంటి భారీ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. కాగా, ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌తో ప్రభాస్ అభిమానులు మళ్లీ థియేటర్లలో ఆ పాత జ్ఞాపకాలను ఆస్వాదించే అవకాశం దక్కించుకోనున్నారు. ఈ రీ-రిలీజ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

