హరీశ్ శంకర్ విషయంలో పవన్ చేస్తున్నది కరెక్టేనా..?
Power star Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తుండటం అందరికీ ఆనందంగానే ఉంది. మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే.. మరోవైపు వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్న పవన్ కళ్యాణ్‌ను చూసి సూపర్ అంటూ మురిసిపోతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ హరీశ్ శంకర్ విషయంలో మాత్రం ఎందుకో పవన్ ఉదాసీనతగా ఉన్నాడు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది.
మూడేండ్ల క్రితం అంటే 2019లో పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు దర్శక నిర్మాతలు. అదే ఏడాది హరీశ్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది హీరోలతో పని చేసే అవకాశం వచ్చినా కూడా.. పవన్ కళ్యాణ్ కోసం వాటిని వదిలిపెట్టాడు హరీశ్. భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ పెట్టి.. దాని కోసం కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా సిద్ధం చేశాడు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడు. షూటింగ్ స్టార్ట్ చేయడమే తరువాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ హరీశ్ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు. ఇక్కడే ఈయన తీరును కొందరు తప్పు పడుతున్నారు. హరీశ్ కంటే తర్వాత వచ్చిన వేణు శ్రీరామ్‌తో వకీల్ సాబ్.. సాగర్ కే చంద్రతో భీమ్లా నాయక్ సినిమాలు పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా సుజిత్ కూడా లైన్లోకి వచ్చాడు. ఈయన సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే హరీశ్ శంకర్‌కు మరో సంవత్సరం పాటు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. కళ్ల ముందు ఉన్న స్టార్ డైరెక్టర్‌ను కాదని కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక.. అభిమానులు కూడా తలకిందులు అవుతున్నారు.
Read More :
“God Father | ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

