న్యూఢిల్లీ : ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) బుధవారం జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించగా గుండె తిరిగి పనిచేసేలా రెండుసార్లు సీపీఆర్ ఇచ్చారు.
జిమ్‌లో గుండెపోటు రావడంతో శ్రీవాస్తవను ఆయన ట్రైనర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రాజు శ్రీవాస్తవకు ప్రస్తుతం డాక్టర్ నితీష్ న్యాయ్ సారధ్యంలోని కార్డియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలకు చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది.