Director Sai Rajesh | టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన యూత్ ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ హార్ట్’. జీడీ నరసింహా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమాపై అంచనాలను పెంచేలా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లోని డైలాగ్స్ మరియు నేపధ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. “కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నువ్వు నాకు ఎదురైన ప్రతీసారి కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయి చూసేది.. నా చివరి శ్వాస వరకు.. నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు.. నీదే.. బతికుంటే నీ ప్రేమతో.. ఊపిరి ఆగితే నీ జ్ఞాపకాలతో.. ప్రతీ ప్రేమ కథ ముగింపు వరకు వెళ్లలేకపోవచ్చు.. కానీ నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా” అంటూ సాగిన ఈ మోషన్ పోస్టర్ లైన్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో సురేష్ గురు, పృధ్వీ రాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు కూడా తమ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్. బి తన కెమెరా పనితనంతో విజువల్స్ రిచ్‌గా వచ్చేలా చేస్తుండగా, సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందిస్తున్న బాణీలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. లక్ష్మణ్ టేకుమూడి మరియు అజయ్ యార్లగడ్డ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు ఇతర అప్డేట్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.