ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జి.మారిముత్తు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు వందకు పైచిలుకు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన మారిముత్తు, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు.
మారిముత్తు చివరి సినిమా రజనీకాంత్ ‘జైలర్’. ఆ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో ప్రముఖుడిగా మంచి పాత్ర పోషించారాయన. మూడు సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. మారిముత్తు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.