Poonam Pandey | పూనమ్ పాండే డెత్ డ్రామాపై చర్యలు తీసుకోవాలి..!
Poonam Pandey | బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సర్వైకల్ క్యానర్‌తో మృతి చెందినట్లుగా పేర్కొన విషయం విధితమే. అయితే, తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని పూనమ్ పాండే వెల్లడించింది.
Poonam Pandey | బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సర్వైకల్ క్యానర్‌తో మృతి చెందినట్లుగా పేర్కొన విషయం విధితమే. అయితే, తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని పూనమ్ పాండే వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. అయితే, ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూనమ్ పాండే మరణం వార్తల మధ్య ఆమె మృతదేహం పుణేలో ఉందని పరిచయం ఉన్న వ్యక్తి పేర్కొన్న తర్వాత.. నటి పూనమ్ మృతి కేసును దర్యాప్తు చేయాలని ప్రచారకర్త ఫ్లిన్ రెమెడియోస్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముంబయి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గర్భాశయ ముఖద్వారం కారణంగా నటి మరణించిందనే వార్తలపై దర్యాప్తు చేయాలని.. ఆ తర్వాత ఐటీచట్టంతో పాటు పలు సెక్షన్ల కేసు నమోదు చేయాలని కోరారు.
పబ్లిసిటీ స్టంట్‌పై పోలీసులు చర్యలు తీసుకోకపోతే తాను కోర్డు ఆశ్రయిస్తానని రెమిడియోస్ పేర్కొన్నారు. ఈ పబ్లిసిటీ స్టంట్ పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్‌లకు నిదర్శనమని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. దక్షిణ గోవాలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పూనమ్‌పై కెనకోనా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ కేసులో పునమ్ అబ్స్కాండింగ్లో ఉందని పోలీసులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. పూనమ్ పాండే మరణంపై ఆమె మేనేజర్ శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ ఫిబ్రవరి ఒకటిన రాత్రి మృతి చెందినట్లుగా మేనేజర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వివరించారు. అయితే, ఆమె మృతి చెందలేదని.. వార్తలన్నీ ఫేక్ అంటూ పలువురు వార్తలను కొట్టిపడేశారు. తాజాగా వీడియో రిలీజ్ చేయడంతోపై ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

