మంగళూరు సోయగం పూజాహెగ్డేకు తెలుగులో మళ్లీ మంచిరోజులొచ్చాయి. టాలీవుడ్లో పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న ఈ భామకు భారీ ఆఫర్లువస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నదీ భామ. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శకుటుంబం’లో పూజాహెగ్డే ఓ ప్రత్యేకగీతంలో నర్తించనున్నట్లు తెలిసింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ చిత్రాలు తెలుగులో పూజాహెగ్డే కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ సినిమాలో పూజాహెగ్డే నటించనుంది. ఐటెంసాంగ్ కోసం చిత్రబృందం ఇటీవలే పూజాహెగ్డేను సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు తెలిసింది. వెంకటేష్, పూజాహెగ్డేలపై ఈ స్పెషల్ సాంగ్ తెరకెక్కించబోతున్నారు. గతంలో వెంకటేష్ ‘ఎఫ్-3’లో పూజాహెగ్డే స్పెషల్‌సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.