Pooja Hegde | దళపతి విజయ్ విజయాన్ని పూజా హెగ్డే ముందుగానే ఊహించిందా.. వైరల్ అవుతున్న వీడియో
Pooja Hegde | తమిళ సినీ రంగంలో అగ్రహీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రెండేళ్ల క్రితం స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల్లో భారీ స్పందన కనిపించింది. ముఖ్యంగా ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం, ఘన విజయం సాధించడం విశేషం.
Pooja Hegde | తమిళ సినీ రంగంలో అగ్రహీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రెండేళ్ల క్రితం స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల్లో భారీ స్పందన కనిపించింది. ముఖ్యంగా ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం, ఘన విజయం సాధించడం విశేషం. ఈ విజయంతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆయన ఎదుగుదల విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రాజకీయ విజయానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్ పూజా హెగ్డే ముందే విజయ్ గెలుస్తారని చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి నటించిన జన నాయగన్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ వీడియోలో, “ఎవరు గెలుస్తారు?” అనే ప్రశ్నకు పూజా సరదాగా విజయ్ వైపు చూపిస్తూ “ఈయనే గెలుస్తారు” అని చెబుతారు. అప్పుడు విజయ్ చిరునవ్వుతో స్పందించారు. ఇప్పుడు ఆయన నిజంగానే విజయం సాధించడంతో, “విజయ్ సార్ సీఎం అవుతారని నేను ముందే ఊహించాను. మీ కలలు నిజం కావాలి” అంటూ పూజా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విజయ్ విజయం తర్వాత అభిమానులు మరో ఆసక్తికర విషయాన్ని బయటకు తీసుకువచ్చారు. ఆయన నటించిన GOAT సినిమాలో కనిపించిన కారు నెంబర్ “TN 07 CM 2026” ఇప్పుడు చర్చనీయాంశమైంది.
“CM 2026” అనే నెంబర్ అప్పట్లోనే ఆయన భవిష్యత్తును సూచించిందా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యాదృచ్ఛికంగా వచ్చిన ఈ నెంబర్ ఇప్పుడు నిజమవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చివరి చిత్రంగా జన నాయగన్ విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో అభిమానులు గర్వపడుతున్నప్పటికీ, ఇకపై ఆయనను వెండితెరపై చూడలేమనే బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ‘దళపతి’గా ప్రేక్షకులను అలరించిన విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నిజమైన ‘జన నాయగన్’గా ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

