పొలిటికల్ సీజన్ దెబ్బ.. థియేటర్లకు ఆడియన్స్ కరువు..!
కచ్చితంగా వాళ్లను థియేటర్ వరకు రప్పించే సినిమాలు వస్తే ఇల్లు దాటి అడుగు బయట పెడతారు. కానీ అలాంటి సినిమా రావడానికి
మామూలుగానే కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు లేక థియేటర్లకు జనం రావడం లేదు. దానికి తోడు ఇప్పుడు పొలిటికల్ సీజన్ కూడా మొదలు కావడంతో థియేటర్ల వైపు రావడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వాళ్లని థియేటర్స్ వరకు రప్పించే సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. అందుకే జనం కూడా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. దానికి తోడు ఓటిటిలో మంచి మంచి సినిమాలు విడుదల అవుతుండడంతో థియేటర్స్ వరకు రావడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉన్నా కూడా.. ఇప్పటికే పొలిటికల్ హీట్ బాగా నడుస్తుంది.
అంతేగాక జనసేన, తెలుగుదేశం సీట్ల వ్యవహారం కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడం.. ఎన్నికల ప్రచారాలు ఇలా హడావిడిగా నడుస్తుంది వ్యవహారం. అందుకే థియేటర్స్ వైపు చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కచ్చితంగా వాళ్లను థియేటర్ వరకు రప్పించే సినిమాలు వస్తే ఇల్లు దాటి అడుగు బయట పెడతారు. కానీ అలాంటి సినిమా రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 1న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ విడుదల కానుంది. ఈ సినిమాపై మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా.. ట్రైలర్ చూసిన తర్వాత గ్రాఫ్ బాగా పెరిగింది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఏపీలో మాత్రం ఎంతవరకు థియేటర్స్ కు ఆడియన్స్ వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలు అయ్యేంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్టిబూటర్లకు భారీ నష్టాలు తప్పవు. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు భారీగా వసూలు చేసిన తర్వాత.. ఫిబ్రవరిలో వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా కలిసి దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేశాయి. కానీ ఫిబ్రవరిలో వచ్చిన అన్ని సినిమాలు కలిపి కనీసం 50 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదు. ఇక మార్చిలో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ సిట్యుయేషన్ మరింత దారుణంగా మారడం ఖాయం.
రాబోయే 15 రోజుల్లో ఆపరేషన్ వాలెంటైన్, గామి, భీమా లాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ వాటికి ఓపెనింగ్స్ తీసుకొచ్చే సత్తా ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 29న టిల్లు స్క్వేర్.. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తున్నాయి. ఇవి వచ్చేవరకు ఇండస్ట్రీలో పొలిటికల్ సీజన్ అలాగే నడిచేలా కనిపిస్తోంది. మరోవైపు ఏప్రిల్ మూడో వారం వరకు ఎన్నికల హడావిడి ఇలాగే ఉంటుంది. మేలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గాని పొలిటికల్ హీట్ తగ్గదు. అప్పటి వరకు ఇండస్ట్రీ పడుతూ లేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

