Naga Shaurya | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..!
పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను పొందలేకపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న జానర్లో సినిమాలు చేస్తున్నా అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు ఆయన సినిమాలను తిప్పి కొడుతున్నారు.
Phalana Abhayi Phalana Ammayi Teaser Date Lock | పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను పొందలేకపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న జానర్లో సినిమాలు చేస్తున్నా అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు ఆయన సినిమాలను తిప్పి కొడుతున్నారు. ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు మరో హిట్టు లేదు. మధ్యలో ఎంతో కష్టపడి చేసిన ‘ఆశ్వథ్థామ’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. భారీ అంచనాల నడుమ గతేడాది రిలీజైన ‘కృష్ణ వ్రిందా విహారి’ కూడా నాగశౌర్యకు నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం ఆయన ఆశలన్ని ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాపైనే ఉన్నాయి.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టింది. తాజాగా మేకర్స్ ఈసినిమా టీజర్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు డిఫరెంట్‌గా రేడియో ద్వారా ప్రకటించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సగభాగం ఇండియాలో, మరో సగభాగం అమెరికాలో సాగనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్ లవ్స్టోరీల తర్వాత నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా వరుస హిట్లతో మంచి ట్రాక్ మేయింటేన్ చేస్తున్న పీపుల్ మీడియా ఈ సినిమాను నిర్మించడంతో జానాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.
అందరికి ఒక ముఖ్య గమనిక 📢
Our Phalana Abbayi
Phalana Ammayi teaser
on 9️⃣th Feb ❤💞Stay Tuned⏳️#PAPA@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 @abhimaharshi1 @kiranganti22@ItsMeghaC @nageshallam
@itsKalyaniMalik pic.twitter.com/h50zAxxVqc— People Media Factory (@peoplemediafcy) February 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

