Mana ShankaraVaraPrasad Garu | మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటుతున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు – పండగకి వస్తున్నారు’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఇప్పటికే 400 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధమైంది. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ చిత్రం నుంచి “పెద్ది రెడ్డి” ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మాస్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఈ పాటకు మరో ప్రత్యేకత ఏమిటంటే, దీనిని స్వయంగా చిరంజీవి గారే ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన అదిరిపోయే బీట్స్‌కు, రఘురాం అందించిన మాస్ లిరిక్స్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.