Peddi | ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం.. బుక్‌మైషోలో 40 వేల మార్క్ దాటిన నాలుగో తెలుగు చిత్రంగా రికార్డు!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విడుదలకు ముందే సినిమాపై నెలకొన్న హైప్‌కు నిదర్శనంగా బుక్‌మైషోలో నమోదైన టికెట్ అమ్మకాలు నిలిచాయి. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా ‘పెద్ది’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో బుక్‌మైషో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో 40 వేల టికెట్ల మార్క్‌ను దాటిన నాలుగో తెలుగు చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
ఇప్పటికే ఈ జాబితాలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’, ‘సలార్’, అలాగే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రాలు ఉండగా, ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలో ‘పెద్ది’ కూడా చేరింది. 2023లో బుక్‌మైషో ప్రవేశపెట్టిన అవర్లీ ట్రెండింగ్ ఫీచర్ తర్వాత తెలుగు సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తిని కొలిచే ప్రధాన ప్రమాణంగా ఈ రికార్డులు మారాయి. అలాంటి పరిస్థితుల్లో 45 వేల టికెట్ల అమ్మకాలతో ‘పెద్ది’ సత్తా చాటడం విశేషంగా మారింది. ముఖ్యంగా విడుదలకు ముందే ఇంతటి స్పందన రావడం, రామ్ చరణ్ మార్కెట్ రేంజ్‌ను మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో పాటు క్రీడా అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కథలో చరణ్ కొత్త లుక్, ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా చరణ్ మాస్ అవతార్, బుచ్చిబాబు సాన రూపొందించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నాయి. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి స్పందన అందుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు చూస్తుంటే తొలి రోజు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

