Peddi Box Office | బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. 5 రోజుల్లోనే రూ. 315 కోట్లు!
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుండే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
బాక్సాఫీస్ వద్ద ఛాంపియన్‌గా నిలిచిన ‘పెద్ది’ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా అద్భుతమైన గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన సోలో చిత్రంగా ‘పెద్ది’ సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయకిగా నటించగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో మెరిశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం మరియు రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో బొమన్ ఇరానీ, జగపతి బాబు, దివ్యేందు వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.
BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/hBzGpimDwP
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/MZCdFnKXTn
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 9, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

