Chiranjeevi | పవన్ నా తమ్ముడు..మంచి నాయకుడు అవుతాడు..జనసేనకు మద్దతుపై చిరంజీవి
తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు మనకు రావాలన్నారు.
తన సోదరుడు పవన్ కల్యాణ్ ( Pawankalyan) స్థాపించిన జనసేన పార్టీ (Janasena Party)కి మద్దతు ఇచ్చే విషయంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు. నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు మనకు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే..దానికి నా మద్దతుంటుందన్నారు.
మేమిద్దరం చెరొక వైపు ఉండటం కంటే నేను పక్కకు తప్పుకోవడమే ఉత్తమమని రాజకీయాల నుంచి వైదొలిగినట్టు చిరంజీవి తెలిపారు. ఈ నిర్ణయం పవన్‌కల్యాణ్‌కు సాయమవుతుందేమోనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నానన్నారు.
పవన్ నా తమ్ముడు..మంచి నాయకుడు అవుతాడు. తను ఏ పక్షాన ఉంటానేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అలాంటివాడు రావాలనేది నా ఆకాంక్ష. పవన్ నిజాయితీ, నిబద్దత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్దత కలిగిన నాయకుడు రావాలి. పవన్‌కు నా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తాను పవన్‌కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతు ఇస్తానేమో..అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న (రేపు) విడుదలవుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

