Pawan Kalyan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ వ్యక్తిత్వం, కృషి, విలువలను ప్రశంసిస్తూ పవన్ రాసిన సందేశం అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. నటన పట్ల అంకితభావంతో ప్రతి సినిమాను ఎంతో కష్టపడి పూర్తి చేసే చరణ్ నిబద్ధతను పవన్ ప్రత్యేకంగా కొనియాడారు. వృత్తి పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ చరణ్ ఉన్నతమైన విలువలను పాటిస్తాడని ఆయన పేర్కొన్నారు. కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత, పెద్దల పట్ల గౌరవం, తోటి నటులు మరియు సాంకేతిక నిపుణుల పట్ల చూపించే మర్యాద చరణ్‌ను ప్రత్యేక వ్యక్తిగా నిలబెడతాయని పవన్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా చరణ్‌లోని ఆధ్యాత్మికత, దైవభక్తి ఆయనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చరణ్ మరెన్నో విజయాలు సాధించాలని, ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందంతో జీవితాన్ని కొనసాగించాలని దేవుడిని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ తన శుభాకాంక్షలను ముగించారు. బాబాయ్-అబ్బాయి మధ్య ఉన్న ఈ అనుబంధం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ సందేశం వైరల్ అవుతూ, మెగా ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కుటుంబ విలువలు, ప్రేమ, గౌరవం అన్నీ కలిసిన ఈ బంధం మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పెద్ది టీజర్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ టీజర్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చరణ్ బాడీ లాంగ్వేజ్, అతని పనితీరుని ప్రశంసిస్తున్నారు. ఇక చరణ్ ఇటీవల షూటింగ్లో గాయపడగా, ఆ గాయంతోనే ప్రస్తుతం పెద్ది షూటింగ్లో పాల్గొంటున్నాడు.
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్!
ప్రముఖ యువ కథానాయకుడు @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2026