Pawan Kalyan | ఆ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకోనున్నాడా?
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ విజయంతో జోష్ మీదున్నాడు. పవన్‌కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.
Pawan Kalyan | పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ విజయంతో జోష్ మీదున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 150కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ తర్వాత ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను చేయాలి. కానీ దానికంటే ముందు ‘వినోదయ సిత్తం’ రీమేక్ మెదలుకానున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఆఫిషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వినోదయ సిత్తం చిత్ర రీమేక్ కోసం పపన్‌కళ్యాణ్ కేవలం 20రోజుల డేట్స్ ఇవ్వనున్నాడట. ఇక ఈ 20రోజులకు గాను పవన్‌కు 50కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు తెలుస్తుంది. అదే గనుక నిజమైతే పవన్‌కు ఒక్క రోజుకు 2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ దక్కనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. పవన్‌కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తెలుగు నేటీవిటీకి తగ్గట్టు కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నాడట. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 25న జరుగనున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

