తన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ షూటింగ్ విరామంలో కథానాయకుడు పవన్‌కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అ దృశ్యాలను చిత్రబృందం కెమెరాలో బంధించింది. ‘షూటింగ్ విరామంలో భీమ్లానాయక్’ అంటూ ఆ వీడియోను విడుదల చేశారు. ‘యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణధారలు వదుల్తాడు. యోధుడు తుపాకీగొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు’..అంటూ ఈ వీడియోపై చిత్రయూనిట్ వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ తుపాకీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని విడుదల చేశారు. ఈ సినిమాలోని తొలిగీతాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, సంగీతం: తమన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.