pawan kalyan remuneration | హరీష్ శంకర్ సినిమాకు 10 కోట్లు పెంచేసిన పవర్ స్టార్

pawan kalyan remuneration | మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star pawan kalyan ) చాలా బిజీ అయిపోయాడు. ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. అయితే అన్నింటికీ ఈయన రికార్డు పారితోషకం తీసుకుంటున్నాడు. మిగిలిన హీరోలు కుళ్లుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో దిల్ రాజుకు లాభాల పంట పండింది. ఈ సినిమా కోసం 50 కోట్లకు అటూ ఇటుగా పవన్ పారితోషికం అందుకున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇప్పుడు కమిట్ అయిన ప్రతీ సినిమాకు భారీ పారితోషికం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ .. మైత్రి మూవీ మేకర్స్ తో మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ( harish shankar ) దర్శకత్వంలో మైత్రీ నిర్మాణంలో ఒక సినిమా ( PSPK28 ) వస్తుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో.. బిజినెస్ కూడా దాదాపు 200 కోట్ల వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. థియేట్రికల్‌తో పాటు అందులోనే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ సినిమాకు పవన్ కళ్యాణ్ 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకూ చెప్పిన దాని కంటే మరో 10 కోట్లు అదనంగా పవన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ కాల్షీట్స్ అవసరం పడటంతో పారితోషికం కూడా ఎక్కువగా తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత అడుగుతున్న కూడా నిర్మాతలు మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు తప్ప.. వెనుకంజ వేయడం లేదు. 2022 లో పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు విడుదల కావడం ఖాయం. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలో సినిమాలు విడుదల చేయబోతున్నాడు పవర్ స్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?
Bigg Boss 5 Sarayu: బిగ్‌బాస్ స్టేజిపై నాగ్‌తోనే బూతులు మాట్లాడించిన సరయు ఎలా ఫేమస్ అయింది?
అమెజాన్ ప్రైమ్‌లో నాని టక్ జగదీష్.. ఓటీటీలో సినిమాల రిలీజ్‌పై గోపీచంద్ రియాక్షన్ ఇది
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
KEY TAGS : PSPK28 | Harish shankar | Pawan kalyan | Power star pawan kalyan | Tollywood | Mythri Movie Makers | pawan kalyan remuneration |
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
Balakrishna | శివ నిర్వాణ దర్శకత్వంలో..? బాలకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

