Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం తాజా షెడ్యూల్ మొదలైనట్టు ఓ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం చిలుకూరు పరిసర ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్లో ఓ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్‌తోపాటు జూనియర్ విలన్స్ ఈ షూట్లో జాయిన్ అయినట్టు ఇన్సైడ్ టాక్. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ ప్లాన్స్‌కు తాత్కాలికంగా తెరదించి పవన్ కల్యాణ్.. ప్రస్తుతం నాన్‌స్టాప్ షూటింగ్‌పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్‌గా పోలీసాఫీసర్ గెటప్‌లో లొకేషన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫొటోలు ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ సారి పర్ ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. అంటూ చెప్పకనే చెబుతున్నాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్ వీడియోలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..