Meera Jasmine | మళ్లీ రెచ్చిపోయిన మీరా జాస్మిన్..
Meera Jasmine | మొన్నటికి మొన్న ఒక హాట్ ఫోటోతో సోషల్ మీడియాలో సడన్‌గా దర్శనమిచ్చింది మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించింది. ఒకప్పటిలా బొద్దుగా కాకుండా మెరుపుతీగలా మేకోవర్ అయింది మీరా జాస్మిన్. ఈమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అమ్మో మీరా జాస్మిన్ ఇలా మారిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
2003లో శివాజీ హీరోగా వచ్చిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా జాస్మిన్. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగానే అమ్మాయి బాగుంది అంటూ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారు. రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమాలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత రవితేజ భద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత బాలకృష్ణ మహారథి సినిమాల్లో నటించింది మీరా. కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్.. అంతే వేగంగా మాయమైపోయింది. గోరింటాకు సినిమాలో రాజశేఖర్ చెల్లెలిగా నటించిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. తెలుగు కంటే తమిళ, కన్నడ మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ చేసింది మీరా జాస్మిన్. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేకిచ్చింది ఈ భామ. అయితే పెళ్లైన ఎనిమిదేళ్ల
తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
39 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లలకు పోటీ ఇస్తూ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది మీరా జాస్మిన్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అందులో నాలుగు పదుల వయసులో ఆమె క్లీవేజ్ షో చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య తెలుగులో ఒక హీరో తన సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటే.. కచ్చితంగా ఒక ఫోటో షూట్ చేయించుకోవాలి అని ఈమెకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మీరా తన రీ ఎంట్రీ కోసం ఇలా హాట్ ఫొటోస్ వైపు అడుగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ బ్యూటీ ఇలా రెచ్చిపోతుంటే షాక్ అయిపోయి చూస్తున్నారు ఆడియన్స్.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా?”
Rashmika Mandanna | బాలీవుడ్ బ్యూటీకి షాకిచ్చిన రష్మిక..
“దాదాపు ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన బబ్లీ బ్యూటీ”
Radheshyam | రాధేశ్యామ్ గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అప్డేట్స్.. లేటెస్ట్ ఏంటంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

