ధర్మం కోసం వీరమల్లు పోరు
పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది.
పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చారిత్రక యోధుడు వీరమల్లుగా పవన్‌కల్యాణ్ కనిపించనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, న్యాయం కోసం, ధర్మం కోసం ఓ వీరుడి పోరాటానికి దృశ్యరూపంలా సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా ఈ సిని మా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ఈ నెల 20న విశాఖపట్నంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తామని చిత్రబృందం పేర్కొంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషుసేన్‌గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఏ.దయాకర్ రావు, దర్శకత్వం: జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

