Pawan Kalyan | మూడో భార్యతో పవన్ విడాకులు.. ఇందులో నిజమెంత?
Pawan Kalyan -Anna Lezhnova | పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. కొంత కాలంగా వీరిద్దరూ విడిగానే ఉంటున్నారని.. అన్నా లెజినోవా పిల్లలను తీసుకుని రష్యా వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan -Anna Lezhnova | పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే.. మరో వైపు లీడర్‌గా జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇటీవలే వారాహితో విజయయాత్ర మొదలు పెట్టి దిగ్విజయంగా తొలి దశను పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయం గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
పవన్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. కొంత కాలంగా వీరిద్దరూ విడిగానే ఉంటున్నారని.. అన్నా లెజినోవా పిల్లలను తీసుకుని రష్యా వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మెగా ఇంట ఎలాంటి వేడుకలోనైనా చురకుగా కనిపించే అన్నా.. ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ.. మెగా ఇంట్లో జరిగే ప్రతీ ఫంక్షన్లోనూ అన్నా కనిపించేది. కానీ వరుణ్-లావణ్య నిశ్చితార్థంలో పవన్ ఒక్కడే కనిపించాడు తప్ప అన్నా లెజ్నోవా కనిపించలేదు. ఇటీవల జరిగిన రామ్‌చరణ్-ఉపాసనల కుమార్తె బారసాల ఫంక్షన్లోనూ కనిపించలేదు.
అంతేకాకుండా వారాహీ విజయయాత్రకు ముందు పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాగంలో కూడా అన్నా లెజినోవా కనిపించలేదు. ఈ పరిస్థితులన్నిటిని చూస్తుంటే నిజంగానే పవన్ విడాకులు తీసుకుంటున్నట్లు అనిపిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇందులో నిజం లేదని.. ఇదంతా దృష్ప్రచారమేనని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. బండ్ల గణేష్ సైతం ఈ వార్తలను ఖండించాడు. ఈ పుకార్లలో నిజం లేదనే విధంగా స్పందిస్తూ ఫైర్ అయ్యాడు. మరీ ఈ రూమర్స్‌కు పవన్ కళ్యాణ్ చెక్ పెడతాడా? లేదా? అనేది చూడాలి.
నీకెవరు చెప్పారా లఫూట్ ……… https://t.co/r0KnLknSdt
— BANDLA GANESH. (@ganeshbandla) July 4, 2023
పుష్కర కాలం క్రితం వచ్చిన తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా వచ్చిన రెండేళ్లకు వీరిద్ధరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. కాగా పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్‌తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

