Pathan | ‘షంషేరా’ థియేటర్లలో షారుఖ్ ‘పఠాన్’ టీజర్?
Pathan Teaser | బాలీవుడ్ బాద్షా షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుఖ్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పఠాన్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటినుండే అప్డేట్లను స్టార్ట్ చేశారు. కాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా టీజర్‌ను ‘షంషేరా’ సినిమాకి జత చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన షంషేరా జూలై 22న విడుదల కానుంది. ఈ క్రమంలో పఠాన్ బృందం టీజర్‌ను షంషేరా థియేటర్లలో ప్రదర్శితం చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటించారు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన షారుఖ్ 8ప్యాక్ ఫోటో, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

