Patang Teaser | యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ‘పతంగ్’.. టీజర్ చూశారా.!
Patang Movie | ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’.
Patang Movie | ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన వేడుకలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉప్పెన ఫేమ్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా సినిమా తీస్తున్న బుచ్చిబాబు సానా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. మరో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా బుచ్బిబాబు మాట్లాడుతూ.. కంటెంట్ చూస్తుంటే సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమాలో యూత్‌ఫుల్ వైబ్ కనిపిస్తుంది. మరో హ్యపీడేస్లా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నాని నాకు మా గురువు గారు సుకుమార్ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. మంచి టెక్నికల్ నాలెడ్జ్ వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకువస్తుందని వెల్లడించారు.
చిత్ర దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ సినిమా టీజర్ నచ్చితే అందరికి సినిమా నచ్చినట్లే. ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఇందులో ఉంటాయి టీజర్లో చెప్పినట్లుగా మ్యాచ్‌లో కలుద్దాం అని తెలిపాడు.
నిర్మాత సంపత్ మక మాట్లాడుతూ ఈ సినిమా చాలా వ్యయ ప్రయాసాలతో జరిగింది. ఈ గాలిపటం దారం తెగకుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావడానికి టీమ్ అంతా కృషి చేశారు. టీజర్లో ఉన్నట్లు అందరూ మ్యాచ్ కోసం ఈ సినిమా మళ్లీ మళ్లీ చూస్తారు.
క్రియేటివ్ నిర్మాత నాని బండెడ్డ్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో సినిమా బిజీలో ఉన్న
బుచ్చిబాబు మా మీద ప్రేమతో ఈ వేడుకకు వచ్చినందుకు కృతజజ్క్షతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాకు థియేటర్స్‌లో యూత్ఫెస్టివల్స్ జరుగుతాయని తెలిపాడు. సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించి మరెంతో మందికి ప్రేరణగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రణీత్ పత్తిపాటి, ఆటా సందీప్ మాస్టర్, మాజీ ప్లార్లమెంట్ సిరిసిల్ల రాజయ్య, నటి శాన్వి, రవిప్రకాష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

