ఆమని, ప్రభాకర్, కునాల్ విశ్వజీత్, సంజన ఆకాశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కైకేయి’. సీను అండోజు దర్శకుడు. హరి , వినయ్‌రెడ్డి, పి.రాజేందర్‌రెడ్డి, అల్లు శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను దర్శకుడు నగేష్ కుకునూర్ ఇటీవల విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఓర్పుతో భరోసాను ఇవ్వాలి కానీ అంచనాలతో వారిని మానసిక ఒత్తిడికి గురిచేయొద్దనే సందేశంతో రూపొందిస్తున్నాం. తన ఆశయాన్ని కొడుకు మీద రుద్దిన ఓ తల్లికి ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి అజమాయిషీలో పడి నలిగిపోతున్న కౌమార విద్యార్థుల సంఘర్షణను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణికల్యాణ్, ఎడిటర్: అనిల్‌కుమార్.