ప్రశ్నించే ‘యూనివర్సిటీ’
‘పేపర్ లీకేజ్ అనేది విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్‌లు. ఇలా అయితే విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి? నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘యూనివర్సిటీ’ ’ అన్నారు ఆర్.నారాయణమూర్తి.
‘పేపర్ లీకేజ్ అనేది విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్‌లు. ఇలా అయితే విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి? నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘యూనివర్సిటీ’ ’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ప్రొషెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఐఏఎస్ అధికారి ఆకురాతి మురళి, బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇది విద్యార్థులేకాదు, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అని హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతమైతే, పైవేటు విద్యారంగం కుదేలవుతుందని, ఫీజులకోసం తల్లిదండ్రుల్ని పీల్చిపిప్పిచేసే ఈ దారుణాలకు తెరపడుతుందని కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు.
విద్య, పని రాజ్యాంగం మనకిచ్చిన హక్కని, దానికోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఏఎస్ అధికారి ఆకురాతి మురళి అన్నారు. ఇంకా జూలూరి గౌరీశంకర్, పాశం యాదగిరి, సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కాశిం, ఇంకా బి.సి నాయకులు గణేశాచారి, దర్శకులు కాశీవిశ్వనాత్, వైఎస్ కృష్ణేశ్వరరావు ఇంకా అనేక విద్యార్థి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

