నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరోలు నాని, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరోలు నాని, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. యాక్టింగ్ స్కూల్లో దుల్కర్ నా జూనియర్. తను మృదుస్వభావి. ప్రతీ విషయంలో క్రమశిక్షణతో ఉంటా డు. అతను పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.
నిజమైన పాన్ ఇండియా స్టార్‌కు నిర్వచనం దుల్కర్ సల్మాన్ అని, అతని కోసం దక్షిణాదితో పాటు హిందీ దర్శకులు కూడా కథలు సిద్ధం చేస్తున్నారని నాని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించాం. ఈ సినిమా కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నా తెలుగు వాయిస్ బాగా కుదిరింది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నా. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman pawns mangalsutra | మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసిన మహిళ
Housing MD Gautham | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలి : హౌసింగ్ ఎండి గౌతమ్
మండల స్థాయి ఆంగ్ల పోటీల్లో జూలూరుపాడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ప్రతిభ
‘సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం’
Fishermen’s Protest | మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరికి మత్స్యకారుల నిరసన సెగ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

