పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన పలాస దర్శకుడు

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు వేచి చూస్తూ ఉంటారు. ఆయన ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికితగ్గట్టు పవన్ కూడా చిన్న దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తున్నాడు. సాగర్ కే చంద్రతో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు పవన్. దీంతో పవన్ పిలుపు కోసం చాలామంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశానని అంటున్నాడు పలాస 1978 సినిమా దర్శకుడు కరుణ కుమార్.
తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ కొట్టాడు దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా సక్సెస్ మీట్లో ఈయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వాలి కానీ అదిరిపోయే సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు చెప్పాడు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లు పేర్కొన్నాడు. పవన్‌ను కలిసి కథ చెప్పేందుకు వేచిచూస్తున్నానని అంటున్నాడు కరుణకుమార్.
పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల్లో కుల వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు దర్శకుడు కరుణకుమార్. ఇలాంటి దర్శకుడితో స్టార్ హీరో సినిమా అంటే ఊహించుకోవడం కాస్త కష్టమే. అందుకే పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అంటున్నాడు. ఇందులో మంచి కాన్సెప్ట్ ఉంది అంటున్నాడు కరుణ. ఈయన రాసుకోవడం వరకు బాగానే ఉంది. అది పవన్ కళ్యాణ్ వరకు చేరడం ఎలా అనేది సస్పెన్స్. ఒకవేళ నిజంగా ఈ దర్శకుడు ఐడియా నచ్చితే పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఒక్కసారి పవన్ ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు దర్శకుడి జయాపజయాలతో సంబంధం లేదు. కథ నచ్చితే ముందుకు వెళ్లిపోతాడు. మరిప్పుడు కరుణ కుమార్ కథ పవన్ వరకు ఎవరు చేరుస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ఒక అమ్మాయిని ఇష్టపడ్డ ఆర్.నారాయణమూర్తి.. పెండ్లి చేసుకుందాం అనుకుంటే..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan kalyan | రికార్డు రేటుకు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

