సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అమ్మదొంగ సినిమా (1995లో)తో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు..ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తోపాటు చాలా మంది హీరోలకు అదిరిపోయే హిట్స్ అందించారు స్టార్ కంపోజర్ కోటి (Koti). ఈ ఏడాది సెహరి సినిమాతో సిల్వర్ స్క్క్రీన్పై నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హీరో తండ్రిగా నటించారు కోటి.
ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇపుడు కొత్త అవతారంతో అందరినీ పలుకరించబోతున్నారు. కోటి ఈ సారి విలన్‌గా భయపెట్టించేందుకు రెడీ అవుతున్నారు. అభిలాశ్ సుంకర, దీపికా ఆరాధ్య కాంబినేషన్లో వస్తున్న చిత్రం పగ పగ పగ (Paga Paga Paga Look). వుయ్యూరు రవి శ్రీ దుర్గ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి కోటి లుక్ ను లాంచ్ చేశారు.
కోటి స్టైలిష్‌గా మాసీ లుక్‌లో అదరగొట్టేస్తున్నారు. సుంకర బ్రదర్స్-AarDeePee సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Presenting Music Sensation @kotiSaluri Garu as Powerful Villan In #PagaPagaPaga 🔥
Launched by @MeherRamesh @raviwuyyuru @Abhilashsunkar5 #RaviSriDurgaPrasad #SatyanarayanaSunkara #Ramsunkara @naveenkumarchal #KAYPaparao #VijayPolaki @PROSaiSatish pic.twitter.com/EjKOJAFJEu
— Ramesh Bala (@rameshlaus) August 12, 2022