Jayam Ravi – Priyanka mohan | తమిళ నటుడు జయం రవి ఇటీవల తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆర్తి మరో ప్రకటన విడుదల చేస్తూ.. తనకు అసలు విడాకుల సంగతి తెలియదంటూ నేను డివోర్స్ ఇవ్వలేనంటూ ఆర్తి ప్రకటించింది. దీంతో ఈ వివాదం కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలావుంటే నటి ప్రియాంక మోహన్, జయం రవి నిశ్చితార్థం చేసుకున్నట్లు సామజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు దండలతో కలిసి ఉన్న ఫొటోలు బయటికి రావడంతో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై ప్రియాంక స్పందించింది. మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అంటూ వస్తున్న వార్తలు అబద్దం అని అందులో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. తామిద్దరం ‘బ్రదర్’ సినిమా కోసం కలిసి పనిచేశామని, ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం ఈ ఫొటోను రిలీజ్ చేసినట్టు తెలిపారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
జయం రవి, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్రదర్. నేనే అంబానీ ఫేమ్ ఏం రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆరెంజ్ ఫేం హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.