Niharika Konidela | మా నలుగురికి లైట్‌గా మెంటల్ ఉంది..నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది నిహారిక (Niharika Konidela). బయట ప్రమోషన్స్ కు వచ్చినా.. ఇంట్లో ఫంక్షన్ జరిగినా చాలా చలాకీగా కనిపిస్తుంది.

మెగా కుటుంబంలో మోస్ట్ ఫన్నీ ఎవరు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే చెప్పే సమాధానం నిహారిక (Niharika Konidela). ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి. బయట ప్రమోషన్స్ కు వచ్చినా.. ఇంట్లో ఫంక్షన్ జరిగినా చాలా చలాకీగా కనిపిస్తుంది. చివరికి సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్ ను కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది నిహారిక. తాజాగా ఈమె ఆలీ (ALi)తో సరదాగా (Alitho Saradaga Show)షోకు వచ్చింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో చాలా విషయాల గురించి మాట్లాడింది నిహారిక.
తన వ్యక్తిగత విషయాలకు తోడు భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పైగా అలీ చిన్నప్పటి నుంచి నిహారికను చూసాడు..ఆ ఇద్దరి మధ్య చనువు ఉంది కాబట్టి పర్సనల్ క్వశ్చన్స్ కూడా బాగానే అడిగాడు. ఈ క్రమంలోనే..చైతన్యతో నీ మొదటి పరిచయం ఎక్కడ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంట కదా అంటూ ఒక సరదా ప్రశ్న అడిగాడు. దానికి నిహారిక సిగ్గుపడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పింది. పెళ్లికి ముందు తనను ఎప్పుడూ చూడలేదని.. కానీ ఆయన మాత్రం తనను చాలాసార్లు చూసి ఉంటాడు అంటూ తెలిపింది నీహా.
అలాగే చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగిన సరదా సంఘటనలు గుర్తు చేసుకుని నవ్వుకుంది నిహారిక. తను ఇంట్లో అందరూ కోతి అని పిలుస్తారని.. తన అన్నయ్య వరుణ్ తేజ్ మాత్రం మరీ ముద్దు వచ్చినప్పుడు పంది అంటాడని చెప్పుకొచ్చింది నిహారిక. తనకు నాన్న అంటే ప్రాణమని.. ఆయన కంటే ఎవరు ఎక్కువ కాదంటూ చెప్పింది మెగా డాటర్. మరోవైపు తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది నిహారిక.
ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులో ఎవరు అంటే నీకు ఎక్కువ ఇష్టం అంటే.. మరో ఆలోచన లేకుండా తన తండ్రి పేరు చెప్పి కూతురు ప్రేమ చాటుకుంది నిహారిక. దాంతోపాటు తమ కుటుంబంలో నలుగురికి లైట్ గా మెంటల్ ఉందంటూ సరదా వ్యాఖ్యలు చేసింది. తనకు, తన చిన్నత్తకు, సాయి ధరమ్ తేజ్ కు, అలాగే నాన్న నాగబాబుకు లైట్ గా మెంటల్ ఉందని.. అందరం ఒకే జాతి అంటూ చెప్పుకొచ్చింది. ఈ ప్రోమోలో ఇంకా చాలా విషయాల గురించి నిహారిక ఓపెన్ అయింది. ప్రస్తుతం ఈమె నిర్మాతగా బిజీ అయిపోయింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటూ వెబ్ సిరీస్ తో నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది నిహారిక. దీన్ని ప్రమోషన్ లో భాగంగానే ఆలీతో సరదాగా షోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

