డైనమిక్ తాన్యశర్మగా.. రుహానీ శర్మ
వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.
వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఇందులో వరుణ్ ఐఏఎఫ్ అధికారిగా నటిస్తుండగా, రాడార్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ కనిపించనున్నది. మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహానీశర్మ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో ఆమె పేరు తాన్యశర్మ.
ఆ పాత్ర లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్‌గా ఆమె ఈ లుక్‌లో కనిపిస్తున్నదని, సినిమాలో పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దేశంకోసం వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూపించబోతున్నామని వారు తెలిపారు. శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

