Ravi Teja | జెట్ స్పీడ్‌లో సినిమా షూటింగ్స్.. వన్ అండ్ ఓన్లీ హీరో రవితేజ..!
క్రాక్ సినిమా తర్వాత రవితేజ (Ravi Teja) రవితేజ నటించిన మూడు సినిమాలు 2022లో విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Ravi Teja | ఎన్ని సినిమాలు ఒప్పుకున్నాం.. నిర్మాతల నుంచి ఎన్ని కోట్లు అడ్వాన్స్ తీసుకున్నామన్నది కాదు.. ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తున్నామా.. నిర్మాతలకు ఒత్తిడి లేకుండా ఎన్ని సినిమాలు విడుదల చేస్తున్నామన్నదే ముఖ్యం. ఈ నియమాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్న హీరోల్లో రవితేజ (Ravi Teja) టాప్‌లో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
2022లో రవితేజ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతేడాది ధమాకా విడుదల సమయంలోనే సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రావణాసురతోపాటు వంశీ దర్శకత్వంలో చేస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు షూటింగ్ కూడా మొదలు పెట్టాడు మాస్ మహారాజా. రవితేజ మరోవైపు Eagle సినిమాపై కూడా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడని వార్త చక్కర్లు కొడుతుండంతోపాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడన్న టాక్ జోరుగా నడుస్తోంది.
అంటే యావరేజ్‌గా రవితేజ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుండగా.. కనీసం మూడు సినిమాలు విడులవుతున్నాయి. ఈ లెక్కన రవితేజ సినిమాలు చేస్తున్నంత వేగంగా మరే హీరో చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో రవితేజ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి కొంత మినహాయింపు ఇవ్వొచ్చు. పవన్ కల్యాణ్ మాత్రం సులభంగా చేయగలిగే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా.. రెమ్యునరేషన్ మాత్రం భారీగానే అందుకుంటారన్న టాక్ కూడా ఉంది.
అయితే పవన్ కల్యాణ్ ఇతర పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ డేట్స్ ఫైనల్ చేయడంలో డైలామా కొనసాగడం.. నిర్మాతలను టెన్షన్ పెట్టడం కనిపిస్తుంటుంది. మొత్తానికి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోగా పేరు తెచ్చుకుంటూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు రవితేజ. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న సీనియర్ హీరోల్లో కూడా రవితేజ మొదటి స్థానంలో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు రవితేజ.
అయితే ఓ వైపు సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూనే.. మరోవైపు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు రవితేజ. క్రాక్ తర్వాత రామారావు ఆన్ డ్యూటీతో శరత్ మండవకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మరో కొత్త దర్శకుడు వంశీతో ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావు సినిమా కూడా చేస్తున్నాడు. ఓ వైపు నిర్మాతలకు సపోర్ట్ ఇస్తూనే.. మరోవైపు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ టాక్ ఆప్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

