రిస్క్ చేస్తేనే విజయాలు వరిస్తాయి!’

‘నిర్మాతలుగా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. సార్వజనీన కథాంశాలతో కూడిన మంచి సినిమాలు చేయాలన్నదే మా సంకల్పం’ అని అన్నారు రాజ్, డీకే. డీ2ఆర్ ఇండీ బ్యానర్‌పై వారు నిర్మించిన తాజా చిత్రం ‘సినిమాబండి’. ప్రవీణ్ దర్శకుడు. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రాజ్, డీకే ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
- మా కష్టాల్ని గుర్తుకుతెచ్చింది
అంచనాలకు మించి సినిమాకు ఆదరణ లభిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల వారు రియలిస్టిక్‌గా సినిమాను తెరకెక్కించామని ప్రశంసిస్తున్నారు. కొత్త ప్రతిభను, యూనిక్ కాన్సెప్ట్‌ను నమ్మి చేసిన ఈ సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ హంగులు లేకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే మంచి కథను చెప్పాలనే మా ప్రయత్నం ఫలించింది. పల్లెటూరి వాతావరణం, సినిమా తీయడానికి ప్రధాన పాత్రలు పడిన కష్టాలు నవ్విస్తూనే హృదయాల్ని హత్తుకుంటున్నాయి.
రిస్క్ తీసుకుంటేనే..
ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రవీణ్, రచయిత వసంత్, సంగీత దర్శకుడు శిరీష్‌తో పాటు పది మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. నటీనటులంతా సహజమైన అభినయాన్ని కనబరిచారు. ఔత్సాహిక ప్రతిభతో పాటు వైవిధ్యమైన కథాంశాలను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే డీ2ఆర్ ఇండీ బ్యానర్‌ను ప్రారంభించాం. రిస్క్ తీసుకున్నప్పుడే ప్రేక్షకుల్ని మెప్పించగలమని మేము నమ్ముతాం. సక్సెస్, లాభాలు అనే అంశాల్ని పక్కనపెట్టి కొత్తదనంతో కూడిన సినిమాలు మాత్రమే నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాతలుగా కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా సినిమా బాగా రావడానికి స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్, ఫైనల్ కాపీ వరకు ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ అవుతాం.
ఆ ధోరణి మారింది
మూడేళ్ల ముందు ‘ఫ్యామిలీమాన్’ వెబ్‌సిరీస్ చేయాలనుకున్నప్పుడు సినిమా దర్శకులుగా గొప్ప పేరున్న మీరు వెబ్‌సిరీస్ చేయడమేంటి? మీ ఇమేజ్ను తగ్గించుకోవద్దు అని చాలా మంది విమర్శించారు. భవిష్యత్తు మొత్తం ఓటీటీలదే అని మేము బలంగా నమ్మి రూపొందించాం.ఆ సిరీస్ విజయంతో ప్రతి ఒక్కరి ఆలోచన ధోరణి మారింది. ప్రస్తుతం ఓటీటీలో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ అందరూ రెడీగా ఉన్నారు. తెలుగులో సిరీస్‌లకు ఆదరణ పెరగడానికి కొంత సమయం పడుతుంది.తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచన ఉంది. మేము దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్‌సిరీస్‌ను జూన్‌లో విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం ప్రస్తుతం షాహిద్‌కపూర్, రాశీఖన్నాలతో వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తున్నాం. మరికొన్ని వెబ్‌సిరీస్‌లతో పాటు సినిమాలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Lockdown
- Raj DK
- Telangana News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

