కరోనా వలన సినీ పరిశ్రమ ఎంతా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తుండగా, కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 గుబులు పుట్టిస్తుంది. ఈ వేరియంట్ పై కథనాలు భయపెడుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఓమిక్రాన్ ఇంపాక్ట్ సెకెండ్ వేవ్ ని మించి ఉంటుందని అంటుండగా, వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఇంపాక్ట్ ఉంటుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలన్నీ థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమవుతుండగా, ఓమిక్రాన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడతాయా అనే చర్చ మొదలైంది. కొన్ని సినిమాలు చేసేదేం లేక ఓటీటీ బాట పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎగ్జిబిటర్లు నిలబడే పరిస్థితి ఉండదు. కొత్త వేరియంట్ విజృంభిస్తే మాత్రం ఆచార్య, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రాల పరిస్థితి దారుణం. ఆచార్య, సర్కారు వారి పాట సహా కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ కోవిడ్ ఆంక్షలు తెరపైకి వస్తే సినిమాల రిలీజ్ లకు ఇబ్బందేనని చాలా మంది భావిస్తున్నారు.