Oke Oka Jeevitham | ఆ స్టార్ హీరో కోసం ఫాంటసీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాను : శ్రీకార్తిక్
చాలా కాలం తర్వాత శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో శర్వానంద్, అక్కినేని అమల నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.
చాలా కాలం తర్వాత శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో శర్వానంద్, అక్కినేని అమల నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో శ్రీకార్తిక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా అమ్మ సెంటమెంట్తో సినిమాను నడిపిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలువురు దర్శకులు ఈయన ప్రతిభను మెచ్చుకొని అభినందించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు.
శ్రీకార్తిక్ తన రెండో సినిమాను అల్లుఅర్జున్‌తో పెద్ద స్కేల్లో థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన వుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఫాంటసీ స్క్రిప్ట్ ఉందని, రియలిజం ఫాంటిసీలో సినిమా ఉంటుందని చెప్పాడు. అల్లుఅర్జున్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలని, చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లుఅర్జున్ సినిమానే అని, తన ఫ్యామిలీలో అంతా బన్నీ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చాడు. ఆయనతో సినిమా గురించి ఐదేళ్ళయినా నిరీక్షించడానికి కూడా ఓకే అంటూ బన్నీపై తన అభిమానాన్ని తెలిపాడు. దీనిపై పలువురు నెటీజన్లు ఖచ్చితంగా బన్నీతో సినిమా తీస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీకార్తిక్ ‘ఒకే ఒక జీవితం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. వెన్నెలకిషోర్, ప్రియదర్శీ, నాజర్ కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ బిజినెస్‌లో 75శాతం రికవరీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మర్కును అందుకునే ఛాన్స్ ఉంది.
Read Also:
Jigarthanda-2 Movie | ‘జిగార్తండ-2’లో విలన్‌గా స్టార్ డైరెక్టర్?
Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Mega154 movie | సంక్రాతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

