Sita Ramam Movie | ‘సీతారామం’ నుండి ఓ సీతా వీడియో సాంగ్ రిలీజ్..!
Oh sita Video Song | ఈ ఏడాది బ్లాక్బాస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో దుల్కర్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 80 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సినిమా విడుదలై 25రోజులు దాటుతున్న ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా విజయంలో పాటలు ముఖ్య పాత్ర పోషించాయి. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకులను ఫిదా చేశాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలోని ‘ఓ సీతా’ అంటూ సాగే ఫీల్ గుడ్ మెలోడీయస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో దుల్కర్, మృణాళ్ థాకూర్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పీ.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆలరిస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. సుమంత్, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

