Oh My God-2 Movie | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Oh My God-2 Movie | అరడజను డిజాస్టర్ల తర్వాత ఓ మై గాడ్-2తో సాలిడ్ హిట్టు అందుకున్నాడు అక్షయ్ కుమార్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజై పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంది.
Oh My God-2 Movie | అరడజను డిజాస్టర్ల తర్వాత ఓ మై గాడ్-2తో సాలిడ్ హిట్టు అందుకున్నాడు అక్షయ్ కుమార్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజై పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంది. పోటీగా గదర్-2 వంటి అరివీర భయంకర హిట్టు సినిమా ఉన్నా.. ఓ మై గాడ్ రెండోందల కోట్ల పైచీలుకు కలెక్షన్లు కొల్లగొట్టింది. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠీల టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయి సినిమాను బంపర్ హిట్టు చేసేశారు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పెడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
ఈ సినిమా అక్టోబర్ 8నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా థియేటర్లలో 27కట్స్‌తో రిలీజైంది. కానీ ఓటీటీలో ఎలాంటి కట్స్ లేకుండా ఒరిజినల్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ముఖ్యమో.. పిల్లలకు లైంగికపరంగా అనవసర భయాలు ఉంటే మానసికంగా ఎలా కుంగిపోతారో వంటి సెన్సిబుల్ అంశాలను ఈ సినిమాలో టచ్ చేశారు.
తొమ్మిదేళ్ల క్రితం ఈ సినిమా తొలిభాగం ఓ మై గాడ్ పేరుతో రిలీజై సంచలనం సృష్టించింది. అప్పుట్లోనే ఈ సినిమా రెండొందల కోట్లు కొల్లగొట్టింది. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. పదేళ్ల క్రితమే బాలీవుడ్లో ఈ సినిమా రెండొందల కోట్లు కొల్లగొట్టింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాలగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

