పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. శనివారం పవన్‌కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘హంగ్రీ చీతా’ పేరుతో ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘పదేళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఆ తుఫాను కడగలేకపోయింది.
అదొక భయంకరమైన రక్తపు స్నానం. అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడు’ అనే వాయిస్ ఓవర్ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ పాత్రను పరిచయం చేసిన విధానం ఎక్సైయిటింగ్గా అనిపించింది. స్లోమోషన్ ఎలివేషన్స్ షాట్స్, ైస్టెలిష్ సినిమాటోగ్రఫీతో గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ నెలలోనే కొత్త షెడ్యూల్‌ను మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఇమ్రాన్హష్మీ, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: సుజీత్.
ఈ నెల 5 నుంచి రంగంలోకి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’
పవన్‌కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చేతిలో కత్తిపట్టుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 5నుంచి ప్రారంభం కానుంది.