OBULAMMA Song| కొండపొలం లవ్ ట్రాక్ తో ‘ఓబులమ్మా’ వీడియో సాంగ్
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు. ఓ ఓ ఓబులమ్మా..బుట్ట చెండు ఆటలోనా పూల కొమ్మా అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా కనిపిస్తున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) ఓ ఓ ఓబులమ్మా అంటూ పాట పడుతుంటే…మరోవైపు గ్రామీణ యువతిగా లంగావోణిలో కనిపిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) రోలు తిప్పుతూ ఈ పాటకు గొంతు కలిపింది.
వైష్ణవ్ తేజ్, రకుల్ మధ్య సాగే ఈ లవ్ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంఎం కీరవాణి సంగీతం ఈ పాటకు జీవం పోసిందని వీడియో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఈ పాటను ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాయగా..సత్య యామిణి, పీవీఎన్ ఎస్ రోహిత్ పాడారు.
రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫారెస్ట్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

