నందమూరి హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్టు బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వం వహిస్తున్నాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ (భీమ్లా నాయక్ ఫేం) ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
కాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండోపాట ఎప్పుడొస్తుందో తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఓ తేనె పలుకుల (O Tene Palukula)సాంగ్‌ను జులై 21న విడుదల చేయనున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్‌ను జులై 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. బింబిసార ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బింబిసార చిత్రానికి ఎడిటింగ్ తమ్మిరాజు. బింబిసారకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ మూవీకి సీక్వెల్స్ కూడా ఉంటాయని ప్రకటించాడు కల్యాణ్ రామ్.
Get ready to dance to the 'Folk Melody of the Season' from #Bimbisara 🕺💃
'O Tene Palukula' Audio Song on 21st July & Video Song on 23rd July ❤️@NANDAMURIKALYAN @CatherineTresa1 @DirVassishta @mmkeeravaani @ChirantannBhatt #VarikuppalaYadagiri @saregamasouth pic.twitter.com/wdhiZIyrCM
— NTR Arts (@NTRArtsOfficial) July 19, 2022