Nuvvu Naaku Nachav| వెంకటేష్ క్లాసికల్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏండ్లు
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమా విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachav)

కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమా విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachav). దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. విజయభాస్కర్ (K Vijaya Bhaskar) తెరకెక్కించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ (Trivikram Srinivas) మార్క్ డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించాడు.
‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 200 రోజులు ఆడి చరిత్ర తిరగరాసింది. క్లాస్ లవ్ స్టోరీగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్లో కామెడీ సీన్స్ ఇప్పటికీ అదుర్స్ అంతే. ఈ చిత్రం 2001, సెప్టెంబర్ 6న విడుదలైంది. అంటే 20 ఏళ్ళు పూర్తి చేసుకుందన్నమాట. మరి 20 ఏళ్ళ కింద నువ్వు నాకు నచ్చావ్ వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..
ప్రాంతాల వారీగా కలెక్షన్లు..
నైజాం- 6.10 కోట్లు
సీడెడ్- 2.80 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.87 కోట్లు
ఈస్ట్- 1.36 కోట్లు
వెస్ట్- 1.13 కోట్లు
గుంటూరు- 1.67 కోట్లు
కృష్ణా- 1.27 కోట్లు
నెల్లూరు- 0.70 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 16.90 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్- 1.14 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 18.04 కోట్లు షేర్
ఆ రోజుల్లో 18 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే అంత వసూలు చేసాయి. అందులో ‘నువ్వు నాకు నచ్చావ్’ కూడా ఒకటి. రూ.7.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో ఏకంగా రూ.18.04 కోట్లు వసూలు చేసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ.10.8 కోట్ల లాభాలు వచ్చాయి. అంతేకాదు దానికి ముందు ‘దేవి పుత్రుడు’, ‘ప్రేమతో రా’ సినిమాలు అంచనాలు అందుకోలేదు. అలాంటి సమయంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్ కోరుకున్న బ్లాక్‌బస్టర్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

