NTR: సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఎన్టీఆర్

నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు ఎంత తీవ్ర విషాదాన్ని మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారక రామారావు కుటుంబంలో ఎంతో విషాదాన్ని మిగిల్చాయి. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్‌రావు, కుమారుడు జూనియర్ రామకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్‌లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్యచౌదరి (హరికృష్ణ తాత) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. హరికృష్ణ, జానకిరాం కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు.
2009లో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ తిరిగొస్తున్న జూనియర్ ఎన్టీఆర్..ఉమ్మడి నల్లగొండ జిల్లా మోతె సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయితే ఆయన అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదాల వలన తన ఫ్యామిలీ సభ్యులు కాని, అభిమానులు, స్నేహితులకు కాని ఏదైన అయితే ఎన్టీఆర్ చలించిపోతారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడడని తెలిసి తన సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ ట్వీట్ చేశారు. సినీ ప్రేక్షకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తేజ్ కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు. తాజాగా తేజ్‌కి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల కాగా, ఆయన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని అన్నారు. ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని స్పష్టం చేశారు.
Wishing you a speedy recovery brother @IamSaiDharamTej ❤️
— Jr NTR (@tarak9999) September 11, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

